తెలంగాణ

21 నుండి గ్రూప్-2 సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ ఎంపికైన అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని ఆమె చెప్పారు. ఏ రోజు ఏ అభ్యర్ధులకు ఈ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుపుతామో సమాచారం ఇస్తామని అన్నారు. అందుకు వీలుగా అభ్యర్ధులు తమ సర్ట్ఫికేట్లు ఒరిజినల్స్‌తో సన్నద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్హతలు, పదో తరగతి సర్ట్ఫికేట్, స్టడీ సర్ట్ఫికేట్లు, కుల ధృవీకరణ, నాన్ క్రీమీ లేయర్ సర్ట్ఫికేట్, రెసిడెన్స్ సర్ట్ఫికేట్, వికలాంగులైతే అందుకు సంబంధించిన సర్ట్ఫికేట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.