తెలంగాణ

శిశువుల మరణాలు కన్పించలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి కెసిఆర్ కిట్ పథకం తప్ప గర్భిణీలు, శిశువుల మృత్యువాత ఘటనలు కన్పించడం లేదా అని టిటిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ పాలనలో మహిళల కష్టాలు, మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సిజేరియన్లు గురించి కేంద్రమంత్రి దృష్టికి రాలేదా అని నిలదీశారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే తెలంగాణలోనే 58 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని లెక్కలు చెబుతుంటే ఆ విషయాలు కేంద్ర మంత్రి దృష్టికి తెలియలేదా అని అన్నారు. శ మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోనే మహిళ ప్రసవిస్తే శిశువు నేలమీద పడి మృత్యువాత పడిన సంఘటన ఎందుకు తెలియరాలేని నిలదీశారు. కెసిఆర్ కిట్ పథకాన్ని ప్రశంసించడం బాగానే ఉందని, అయితే శిశువుల మరణాలు కూడా కేంద్ర మంత్రి పట్టించుకుని ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్రమంత్రికి వాస్తవాలు తెలియజేయాలని ఆయన బిజెబి నేతలకు సలహా ఇచ్చారు. తెరాస పాలన అద్భుతంగా ఉందని బీహార్ మంత్రి మంగళ్‌పాండే, డిప్యూటీ సిఎం సుశీల్‌కుమార్ మోదీ, కెసిఆర్ పాలనకు కితాబు ఇస్తే, బిజెపి నేతలు కెసిఆర్ పాలనపై దుమ్మెత్తి పోయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.