తెలంగాణ

ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వివిధ వృత్తుల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్న వారు సమాజానికి మరింత ఉపయోగపడేందుకు రాజకీయాల్లోకి రావాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్తగా ఇటీవల నియమితులైన మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి అధ్వర్యలో శనివారం గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. అనంతరం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులు మహ్మద్ షబ్బీర్ అలీ, డాక్టర్ గీతారెడ్డి, మల్లు రవితో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో ప్రొఫెషనల్స్ ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లో ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం మేధావులు, ప్రొఫెషనల్స్ రాజకీయాలకు దూరమయ్యారని అన్నారు. ఎంతో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో బతికే ఈ దేశంలో 2014 సంవత్సరం మే తర్వాత ఒక నిర్బంధకాండ, అణచివేత ప్రారంభమయ్యాయని అన్నారు. ఏమి తినాలో, ఏ బట్టలు కట్టుకోవాలో, ఎలాంటి జీవన విధానం ఉండాలో కూడా పాలక పక్షాలే నిర్ణయించి ప్రజలపై రుద్దుతున్నాయని ఆయన విమర్శించారు. ఉత్తర భారత దేశంలో బీఫ్ తింటున్నారని కొంత మందిని హత్య చేశారని, మైనారిటీలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపైనా ఆంక్షలు పెరిగాయని అన్నారు.

చిత్రం..గాంధీభవన్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి నేత ఉత్తమ్