తెలంగాణ

దోపిడీపై ‘కలంపోరు’ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 17: సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తన ప్రాణం ఉన్నంతవరకు రచనలు చేస్తూనే ఉంటానని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. హైదరాబాద్ నుండి హన్మకొండ వెళ్తూ ఆయన ఆదివారం మార్గమధ్యంలో జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో కాసే పు ముచ్చటించారు. ఎన్‌డిఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బిజె పికి దేశంలోని ఆర్యవైశ్యులంతా చందాలిస్తూ ఆదుకుంటున్నారని ఆరోపించారు. అందుకే బిజెపి వాళ్లకు పెరుగన్నం పెడుతూ పేదలకు పురుగన్నం పెడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన దళిత గిరిజనుల సంక్షేమానికి ఏమాత్రం పాటుపడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమాలపై పాలకులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారని అన్నా రు. ప్రజలంతా ఏకమై వారికి గుణపాఠం చెప్పేందుకే టిమాస్ రూపంలో ముందుకు వస్తున్నారని అన్నారు. కాగా, కంచె ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారని తెలుసుకున్న స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు పలువురు చౌరస్తాకు చేరుకుని నిరసన తెలిపేందుకు వచ్చారు. అప్పటివరకే ఆయన మీడియాతో మాట్లాడి హన్మకొండకు బయలుదేరారు.