తెలంగాణ

ఆయనే సామాజిక ఉగ్రవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పేరుతో పుస్తకం రచించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్యను సామాజిక ఉగ్రవాదిగా టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం అభివర్ణించింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగం ఒక వ్యక్తిని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ కించపర్చే హక్కు ఎవరికీ ఇవ్వలేదని టిఆర్‌ఎస్ గుర్తు చేసింది. సామాజిక సేవలో ప్రజలకు తలలో నాలుకలా పెనవేసుకున్న అనుబంధం వైశ్యులదని టిఆర్‌ఎస్ పేర్కొంది. టిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆదివారం పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాల్‌రాజు, బిగాల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ కంచె ఐలయ్య తమ గురించి రాసిన పుస్తకం వల్ల ఆర్యవైశ్యులంతా ఎంతో వేదనకు గురవుతున్నారని అన్నారు. ఐలయ్య తాను చేసిన తప్పును గుర్తించి తక్షణమే ఆ వివాదాస్పద పుస్తకాన్ని ఉప సంహరించుకోవాలని టిఆర్‌ఎస్ ఎల్పీ డిమాండ్ చేసింది. పుస్తకాన్ని ఉప సంహరించుకోకుండా ఐలయ్య ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే వైశ్యుల తరఫున టిఆర్‌ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ పుస్తకాన్ని రచించడానికి ప్రాతిపదిక ఏమిటని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఐలయ్య ఒక సామాజిక ఉగ్రవాది అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు.