తెలంగాణ

భూరికార్డుల ప్రక్షాళనపై కాంగ్రెస్ డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ డేగకన్ను వేయబోతోంది. సవరణల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా, గ్రామాల్లో రైతులకు అన్యాయం జరుగకుండా, వారిని అప్రమత్తం చేసేందుకు ఇందిరమ్మ రైతుబాట పేర గ్రామాలకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. రాష్టవ్య్రాప్తంగా వందరోజుల పాటు రెవెన్యూ అధికారులు చేపట్టే క్షేత్రస్థాయి తనిఖీలు, రికార్డుల్లో చేసే మార్పులు, చేర్పుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా గమనిస్తూ, రైతులను చైతన్యపరుస్తూ వారి పక్షాన నిలిచేందుకు ఉద్యుక్తమవుతోంది. ఈ రైతుబాట కార్యక్రమానికి ఉద్యమఖిల్లా కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు అన్ని స్థాయిల్లోని పదాధికారు లు, ముఖ్య కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా, ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షు డు కొప్పుల రాజు, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత కుం దూరు జానారెడ్డి, శాసనమండలి నేత ఎండి. షబ్బీర్ అలీతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరాగార్డెన్‌లోనిర్వహించే అవగాహన సదస్సుకు ఉమ్మడి జిల్లాలోని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా ఇప్పటికే అన్ని జిల్లా, బ్లాక్, మండల స్థాయి కమిటీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. భూయాజమాన్య హక్కులు, భూములకు సంబంధించిన పలు అంశాలపై బుక్‌లెట్లు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల పేరిట చేసే కుట్రలను సదస్సులో వివరించనున్నట్లు పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వందరోజుల పాటు నిర్వహించే ఈ అవగాహన సదస్సులు అన్ని జిల్లా కేంద్రాలతో పాటు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్లు వెల్లడించారు.