తెలంగాణ

ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఈ విమానాశ్రయానికి ప్రతి నిత్యం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కమిషన్ బేస్డ్‌తో కొందరు, సొంతంగా మరికొందరు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్చూ పట్టుబడుతున్నారు. కాగా గత సంవత్సరం పది కేసులు నమోదు కాగా, ఈ యేడు డిఆర్‌ఐ అధికారులు 49 కేసులు నమోదు చేసి 20.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే పట్టుబడిన వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉండడం గమనార్హం. విదేశాల్లో వివిధ కంపెనీల్లో వివిధ పనులపై వెళ్తూ, వస్తున్న కార్మికులు అధిక శాతం కమిషన్ బేస్డ్‌పై హైదరాబాద్‌కు బంగారం తెస్తున్నట్టు డిఆర్‌ఐ అధికారుల సర్వేలో వెల్లడైంది.
2016 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 10 కేసులు నమోదు కాగా, రూ. 1.57 కోట్లు విలువ చేసే 5.5 కిలోల బంగారం పట్టుబడింది. అదేవిధంగా 2017 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అక్రమంగా బంగారం, బంగారు ఆభరణాలు హైదరాబాద్‌కు తెస్తున్న 49 మందిపై కేసు నమోదు చేశారు. రూ. 6.25 కోట్లు విలువ చేసే 20.8 కిలోల బంగారంను అధికారులు సీజ్ చేశారు. వీరిలో పది మంది కరీంనగర్ జిల్లా వాసులు ఉన్నట్టు డిఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. కొంత మంది బంగారు బిస్కెట్లు, చైన్లు రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా, మరికొందరు ఒంటిపై కిలోల కొద్ది ఆభరణాలు ధరించి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు విమానాశ్రయం అధికారులు తెలిపారు.