తెలంగాణ

బతుకమ్మ పాటలు వెలికితీసి రికార్డు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: సాం ప్రదాయ బతుకమ్మ పాటలను వెలికితీసి రికార్డు చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం తెలంగాణ జాగృతి సంస్థ బతుకమ్మ పాలు సేకరించి రూపొందించిన సిడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సాంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప వౌలిక సాహిత్యమన్నారు. తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతున్న 40 బతుకమ్మ పాటలను 8 సిడీలుగా తెలంగాణ జాగృతి సంస్థ సేకరించి 12 మంది కళాకారులతో పాడించిందని జాగృతి సంస్థ ప్రతినిధి శరత్ తెలిపారు. ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సేకరించి సిడీలు రూపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ పరిషత్ చైర్మన్ శ్రీ్ధర్‌స్వామి, ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.