తెలంగాణ

ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఆధునిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకుంటోదని, దాంతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల కమిషనర్ సి.వి. ఆనందర్ పేర్కొన్నారు. వినియోగదారులు ఫోరం దక్షిణాది రాష్ట్రాల రెండురోజుల సమావేశంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో పవర్‌పాయింట్ ప్రెసెంటేషన్ చేస్తూ, అక్రమాలకు అడ్డుకట్టవేయడంతో ఈ వ్యవస్థను ప్రజలకు మరింతచేరువుగా తీసుకువెళ్లామన్నారు. ప్రత్యేకంగా టి-రేషన్ మొబైల్ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా రేషన్ లావాదేవీలు సామాన్యప్రజలు కూడా నేరుగా తెలుసుకునేందుకు వీలవుతోందన్నారు. జాతీయ ఆహార భద్రత కార్డుల ద్వారా కేంద్రప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు కిలో మూడురూపాయల చొప్పున ఐదుకిలోల బియ్యం ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి కిలో ఒకరూపాయి చొప్పున ఆరు కిలోల బియ్యం ఇస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 2.75 కోట్ల మంది లబ్దిపొందుతున్నారని వివరించారు. బియ్యం దుర్వినియోగం కాకుండా ప్రతి రేషన్ దుకాణంలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశామని, ఎలక్ట్రానిక్ తూకం ఏర్పాటు చేశామన్నారు. గోడౌన్ల నుండి బియ్యం తీసుకుని రేషన్ దుకాణాలకు సరఫరా చేసే వాహనాలకు జిపిఎస్ విధానం ఏర్పాటు చేసి, పర్యవేక్షణకు పౌరసరఫరాల ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గోదాముల నుండి రేషన్ దుకాణాలకు సరకులు చేరగానే లబ్దిదారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందే ఏర్పాటు చేశామని ఆనంద్ తెలిపారు. పౌరసరఫరాలకు సంబంధించి 171 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో (ఎంఎల్‌ఎస్) దశలవారీగా సిసి కెమెరాలు పెట్టి లోడింగ్, అన్‌లోడింగ్ లావాదేవీలను పరిశీలిస్తున్నామన్నారు. 2016 మార్చి నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈపాస్ విధానం అమలు చేస్తున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి 375 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ఆనంద్ గుర్తు చేశారు. నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా ఐరిస్ స్కానర్, ఎలక్ట్రానిక్ తూకం, వాయిస్ ప్లేయర్, డిజిటర్ నగదు చెల్లంపులు, కార్డుస్వైపింగ్ నగదు రహిత లావాదేవీలు, మైక్రో ఎంటిఎంలు ఏర్పాటు చేశామన్నారు.