తెలంగాణ

ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 17: మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాల మేరకు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు కీసర సిఐ సురేందర్‌గౌడ్ తెలిపారు.
కూకట్‌పల్లి మండలం, ఆల్విన్ కాలనీకి చెందిన టిఆర్‌ఎస్ కార్పొరేటర్ వెంకటేశ్ తన అనుచరులతో గురువారం రాత్రి కీసరలోని మేడ్చల్ కార్యాలయానికి వచ్చి, కాలనీ సమస్యలు కలెక్టర్‌కు విన్నవించేందుకు అపాయింట్‌మెంట్‌కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్‌ను కలెక్టర్ పిలువక పోవటంతో ఆగ్రహం చెందిన వెంకటేశ్ తలుపులు తోసుకొని ఛాంబర్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది వారించిన వినకుండా ఎంతసేపు ఉండాలంటూ అసభ్య పదజాలంతో కలెక్టర్‌ను దూషించారని సమాచారం. దీంతో కోపోద్రిక్తులైన కలెక్టర్ కార్పొరేటర్ వెంకటేశ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కీసర సిఐ సురేందర్‌గౌడ్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్‌పై 353 సెక్ష్షెన్ క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతర వివరాలు వెల్లడించేందుకు కీసర పోలీసులు నిరాకరించారు.