తెలంగాణ

పూర్తి విస్తీర్ణంలో పత్తి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు పంటలు సాగయిన భూముల విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 108 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకావలసి ఉండగా, ఈ ఏడు సెప్టెంబర్ రెండోవారం వరకు 96 లక్షల ఎకరాల్లో పంటల సాగు అయింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 92 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు జరిగింది. వరినాట్లు చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణం పెరిగింది. సాధారణంగా 40 లక్షల ఎకరాల్లో పత్తివేయడం పరిపాటి కాగా, ఈ సీజన్‌లో 46 లక్షల ఎకరాల్లో పత్తిసాగయింది. గత ఏడాది ప్రభుత్వమే పత్తి వేయవద్దంటూ విస్తృతంగా ప్రచారం చేయడంతో 30 లక్షల ఎకరాల్లోనే వేశారు. ప్రధాన పంట అయిన వరిధాన్యం ఇంకాపూర్తి విస్తీర్ణానికి చేరలేదు. సాధారణంగా 25 లక్షల ఎకారాల్లో వరి సాగవుతుండగా, ఖరీఫ్‌లో 20 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పూర్తయ్యాయి. నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద సాగునీరు లేకపోవడం, చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి నీరు రాకపోవడంతో వరివిస్తీర్ణం పూర్తిస్థాయికి చేరలేదు.
జొన్న, మొక్కజొన్న, తైదలు, ఇతర తృణధాన్యాలు కలిపి 15 లక్షల ఎకరాల్లో సాగుకావలసి ఉండగా, 12.50 లక్షల ఎకరాల్లో సాగయింది. కందులు, పెసలు, సెనగ, ఉలవ, మినుములు తదితర పప్పుదినుసులు 10 లక్షల ఎకరాల్లో సాగయింది. పల్లీ, ఆముదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర నూనె విత్తనాలు ఐదులక్షల ఎకరాల్లో (64 శాతం) సాగయ్యాయి.
నాలుగు జిల్లాల్లో 100 శాతం
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ (అర్బన్), నిర్మల్ జిల్లాల్లో నూటికి నూరు శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. గద్వాల, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో 75 శాతం కన్నా తక్కువ విస్తీర్ణంలో పంటల సాగయ్యాయి. మిగతా 23 జిల్లాల్లో 76 శాతం నుండి 100 శాతం మధ్యలో పంటల సాగు జరిగింది.