తెలంగాణ

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన (విలీన) దినోత్సవాన్ని ఆదివారం మజ్లిస్ మినహా అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. జాతీయ జెండా ఎగుర వేశారు. ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో తెలంగాణకు విమోచన కలిగేందుకు ముఖ్య కారకుడైన నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవను కీర్తిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుండా వెనకడుగు వేయడాన్ని తూర్పారబట్టారు.
గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో నయా రాజాకార్ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేలు వేశారని, నేరెళ్ళలో దళితులపై పోలీసులు దాడి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, భూపాల్‌పల్లిలో గిరిజనులపై పోలీసులు దాడి చేశారని ఆయన ఉదహరించారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభిస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చినా, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినా అది కాంగ్రెస్‌తోనే సాధ్యమైందన్నారు. అంతకు ముందు ఆయన సర్దార్ పటేల్ చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ సారధ్య
బృందం ఆధ్వర్యంలో..
తెలంగాణ సారధ్య బృందం అధ్వర్యంలో కోఠి చౌరస్తాలోని అశోక్ పిల్లర్ వద్ద నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవంలో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ ఎంపి రాపోలు ఆనంద భాస్కర్, పార్టీ మాజీ ఎంపి వి. హనుమంత రావు, నాయకుడు జి. నిరంజన్ తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.
తెలంగాణ భవన్‌లో..
టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని ప్రసంగిస్తూ సెప్టెంబర్ 17ను రాజకీయం చేయవద్దని అన్ని పార్టీలను కోరారు. బిజెపి మత రాజకీయాలు మానుకోవాలని అన్నారు. బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. ఇంకా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భవన్‌లో..
టిడిపి కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా రమణ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేస్తే, అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని విమర్శించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయానికి వెళ్ళాలని, పేదవాడి డబ్బును కొత్త భవనాల పేరిట దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. విలీన దినోత్సవం అనేది ఒక పండుగ అని, ప్రజల మనోభావాలని కెసిఆర్ గౌరవించాలని కోరారు.
బిజెపికి సంబంధమే లేదు: చాడ
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా చాడ ప్రసంగిస్తూ ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా తమ పార్టీ గుర్తిస్తున్నదని అన్నారు. తెలంగాణ విమోచన దినం గా చెబుతున్న బిజెపికి అసలు ఉద్యమంతో ఆ పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కుగానీ సంబంధమే లేదని ఆయన తెలిపారు. నెహ్రు అనుమతి లేకుండానే సర్దార్ పటేల్ పోలీసు యాక్షన్ చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాఉండగా రావి నారాయణ రెడ్డి హాలులో భారత దేశంలో హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవాన్ని పార్టీ నిర్వహించింది.

చిత్రం..గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి