తెలంగాణ

ప్రభుత్వ విద్య పటిష్టతకు టీచర్లు పునరంకితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్య పటిష్టతకు పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఖరాలు చేసి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. గత కొనే్నళ్లగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను గత మూడేళ్లగా గాడిలో పెడుతున్నామని అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం 70 ఏళ్ల ఉద్యమోత్సవంలో కడియం పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువై ప్రతి దానికి కేసులు వేస్తూ వాటిని జఠిలం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచనలు చేసేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి కావాలని, దీనికి నాణ్యమైన విద్యే ప్రధానమని అన్నారు. గత మూడేళ్లలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వలసలు పెరిగాయని, ఫలితాలు కూడా ఆశించిన స్ధాయిలో వస్తున్నాయని కడియం స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ సీట్లకు, ఎంసెట్‌లో అర్హత సాధిస్తున్న వారికీ పొంతన లేదని అన్నారు. సీట్లు 2,50,000 ఉంటే, అర్హత సాధించే వారు 1,10,000 మంది మాత్రమే ఉంటున్నారని అన్నారు. అలాగే డిగ్రీ ప్రవేశాలకు 4,60,000 సీట్లు ఉంటే, ఆధార్ లింక్‌తో కూడిన అడ్మిషన్లు చేపట్టడంతో ఇప్పుడు 2,50,000కు తగ్గిపోయిందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. లాంగ్వేజ్ పండిట్లు, పిఈటీలకు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా చేసి సర్వీస్ నిబంధనల కిందకు తీసుకు వస్తామని చెప్పారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి