తెలంగాణ

రజాకార్లను మరిపించేలా తెరాస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కెసిఆర్ పాలన రజాకర్లను మించిపోయిందని టిటిడిపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్, టిఎన్‌టియూసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి ఆరోపించారు. విలీన దినోత్సవం ముందు రోజు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో 36 మంది గిరిజనులను, మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టి చిత్ర హింసలు పెట్టి, వారి గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని అన్నారు. ఇది రజాకర్ల పాలనను మరిపించే చర్యగా ఉందని, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆదివారం నాడిక్కడ వారు విలేకరులే సమావేశంలో మాట్లాడుతూ ఈ దశలో తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. తా డ్వాయి ఘటనను మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనుల గుడిసెలు కూల్చేయడం పట్ల సభ్య సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో నిజాం పాలనలో చూశామని, ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ భవన్‌లో విశ్వకర్మ జయంతి
ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. నేతలు విశ్వకర్మ చిత్రపటం వద్ద దీపాలంకరణ చేశారు. టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పాలుపంచుకునే చేతివృత్తి వారికి విశ్వకర్మ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విశ్వకర్మలు పడుతున్న కష్టాలపై కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇంకా బిసిసెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్‌గౌడ్ తదితరులు ప్రసంగించారు.

చిత్రం..ఎన్టీఆర్ భవన్‌లో మాట్లాడుతున్న టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ