తెలంగాణ

విరమణ తర్వాత అంగన్‌వాడీ టీచర్లకు 60 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అంగన్‌వాడీల్లో పనిచేసే టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు 60 సంవత్సరాలు నిండగానే వారికి బాధ్యతల నుండి విముక్తి కల్పిస్తున్నారు. బాధ్యతల నుండి తొలిగిపోయే అంగన్‌వాడీ టీచర్లకు 60 వేల రూపాయలు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు 30 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ మేరకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. అశోక్ కుమార్ పేరుతో జీఓ (నెంబర్ 19, తేదీ 18-09-2017) జారీ అయింది. గతంలో పదవీ బాధ్యతల నుండి తొలిగిపోయే అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లకు ఎలాంటి సాయం అందేది కాదు.