తెలంగాణ

రెండుకళ్ల సిద్ధాంతాన్ని తెచ్చిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై చర్చ జరుగుతున్న సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే వేసిందెవరు? తెలంగాణ సమయంలో రెండుకళ్ల సిద్ధాంతాన్ని తెచ్చిందెవరు అంటూ గురుకుల సొసైటీల్లో వివిధ పోస్టులకు నిర్వహించిన ఎంపిక పరీక్షలో అడిగిన ప్రశ్నలకు అభ్యర్ధులు దిమ్మదిరిగిపోయారు. ఈ పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అదే తరహా ప్రశ్నలు చాలా అడిగారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిందెవరు? అంటూ ఒక ప్రశ్న అడిగారు. దానికి జవాబులుగా వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి, బివి రాఘవులు, ఎం వెంకయ్యనాయుడు(బిజెపి) , ఎన్ చంద్రబాబునాయుడు అంటూ సమాధానాలు ఇచ్చారు. మరో ప్రశ్నగా లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినపుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు అంటూ అడిగారు. దానికి ఆప్షన్లుగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నారమల్లి శివప్రసాద్, సుజనా చౌదరి పేర్లను ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఆంధ్రా, తెలంగాణ తనకు రెండు కళ్ల వంటివని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. లోక్‌సభలో పెప్పర్ స్ప్రేను లగడపాటి రాజగోపాల్ వినియోగించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ ఇన్ పర్సన్స్ రిపోర్టు ఇచ్చినందుకు అమెరికా అవార్డు పొందిన ఐపిఎస్ అధికారి ఎవరు? అనే ప్రశ్నకు అనురాగ్ శర్మ, ఎం మహేందర్‌రెడ్డి, మహేష్ మురళీధర్ భగవత్, సివి ఆనంద్ అనే సమాధానాలు ఇచ్చారు. దాదాపు తెలంగాణ సంస్కృతి, వికాసానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి.