తెలంగాణ

రైతు కమిటీలను నిరసిస్తూ వౌన దీక్షకు అఖిలపక్షం యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెం.39ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం నాయకులు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట చేయాలనుకున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. చొచ్చుకుని వెళ్ళేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళి, ఆ తర్వాత విడుదల చేశారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అధ్వర్యంలో విపక్షాల నేతలు, కార్యకర్తలు నోటికి నల్లటి రిబ్బన్ కట్టుకుని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి చేరుకోబోతుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రొఫెసర్ కోదండ్‌రామ్ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని విపక్షాల నాయకులు దుయ్యబట్టారు.