తెలంగాణ

12 లక్షల మొక్కలు నాటనున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: పాడి సొసైటీల అధ్వర్యంలో రైతులతో 12 లక్షల మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నది. పాడి రైతుల సొసైటీల అధ్వర్యంలో ఈ నెల 21 నుంచి హరితహారం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలాఉండగా సోమవారం సిఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ సంబంధిత శాఖలతో ఏర్పాట్లపై సమీక్షించారు. అటవీ, ఉద్యానవన, పశు సంవర్థక, విజయ డైరీతో పాటు పాడి రైతుల సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 27నుంచి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు భూపాల్ రెడ్డి, ప్రియాంక వారికి వివరించారు. విజయ డైరీ నోడల్ ఏజెన్సీగా ఉంటూ అటవీ, ఉద్యానవన శాఖలతో సమన్వయం చేసుకుంటూ మొక్కల పంపిణీ చేయనుంది. అటవీ శాఖతో పాటు ఉద్యానవన నర్సర్సీల్లో ఉన్న మొక్కలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాల్సి ఉంటుందన్న అంశంపై అధికారులు సమీక్షించారు.