తెలంగాణ

హైదరాబాద్ వేదికగా 21 నుంచి ఇండియన్ ఫొటోగ్రఫీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టవల్‌కు హైదరాబాద్ నగరం వేదిక కాబోతున్నది. మూడవ ఎడిషన్ ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఈ నెల 21 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌ను తెలంగాణ పర్యాటక శాఖ, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీతో పాటు లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరుసగా మూడో సంవత్సరం నిర్వహిస్తున్న ఈ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ దేశంలో ఇప్పటికే రెండో స్థానంలో నిలవడం ద్వారా హైదరాబాద్ నగరం ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువబోతున్నదని ఆయన తెలిపారు. ఈ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో 40 దేశాల నుంచి 525 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనబోతున్నారని ఆయన వివరించారు. ఈ ఫెస్టివల్ వెబ్‌సైట్‌లో 176 దేశాలు, సోషల్ మీడియాలో 60 దేశాలు చూస్తాయని ఆయన తెలిపారు.