తెలంగాణ

హైదరాబాద్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, సెప్టెంబర్ 18: హైదరాబాద్ ఎల్‌బినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాక్‌టౌన్ కాలనీలో వైద్య విద్యార్థిని (వివాహిత) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు భర్త, అత్త,మామలను అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఆధారాలు ఆధారాలు సేకరిస్తున్నారని, పోస్టుమార్టం నివేదిక తరువాత చర్యలు తీసుకుంటామని ఏసిపి వేణుగోపాల్‌రావు తెలిపారు.
మెడిసిన్ సీట్ రాలేదని హత్య
ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన ఎం.రుషి కుమార్ ఖమ్మం జిల్లా పాలేరు మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు హరిత (మేనమామ కూతురు (24)తో రెండేళ్ల క్రితం (2015)లో పెద్దల సమక్షంలో వివాహమైంది. పెళ్లి తరువాత ఉన్నత చదువు కోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్‌లోని రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మెడికల్ విద్యార్థిని అయిన హరితను భర్త మెడిసిన్ చదివిస్తున్నాడు. కాగా హరిత మెడిసిన్‌లో ఎంబిబిఎస్ కాకుండా బిడిఎస్‌లోసీటు సాధించింది. అప్పటి నుండి హరితను భర్త రిషికుమార్ తీవ్రంగా వేధించడం మెదలు పెట్టాడు. ఆదివారం రాత్రి ఇంట్టో ఎవరు లేని సమయంలో ఒంటి పై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు తెలుస్తోంది. కాగా హరిత ఆత్మహత్యకు పాల్పడిందని తమకు ఫోన్ రాగా హైదరాబాద్‌కు వచ్చామని, మృతదేహాన్ని పరిశీలిస్తే తమ కూతురు సగం కాలిపోయిన స్థితిలో ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఎంబిబిఎస్‌లో సీటు రాలేదని కోపంతోనే హరితను హత్య చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి ఆధారంగా నిందితులపై చర్య తీసుకుంటామని ఏసిపి తెలిపారు.

హరిత పెళ్లినాటి ఫొటో