తెలంగాణ

మూడు జిల్లాలు ముందు.. ఏడు వెనుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు కొన్ని జిల్లాల్లో చురుకుగా సాగడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే పనులు చురుకుగా జరుగుతుండగా ఏడు జిల్లాల్లో వెనుకబడి పోయిందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రాజీవ్ స్వగృహ పథకాలపై సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు సిద్దిపేట, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలతో చురుకుగా జరుగుతుండగా జోగలాంబ గద్వాల, కొమరం భీమ్, వనపర్తి, నిర్మల్, వరంగల్ (రూరల్), వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు వెనుకబడి ఉన్నాయని సిఎస్ వివరించారు. పనులు మందకోడిగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని సిఎస్ ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.16.715 కోట్ల వ్యయంతో 2,68,099 ఇళ్లకు మంజురు ఇచ్చి నిర్మాణాలు చేపట్టామన్నారు.
ఇందులో 1,07,367 ఇళ్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయిందన్నారు. మిగిలిన నిర్మాణాలకు కూడా త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఇళ్లను ఉద్యోగులకు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బండ్లగూడ, పోచారంలో మొదటి విడతలో ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇక నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై నెలవారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలవారిగా అవసరమైన నిధులకు ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ఆర్థికశాఖకు సమర్పించాలని సిఎస్ సూచించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు హౌజింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.