తెలంగాణ

జూరాలకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 18: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాలకు జలకళ సంతరించుకుంది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి 1,68,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 20 గేట్లను తెరిచి దిగువ భాగానికి 1,73,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, సమాంతర కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు భీమా నది నుండి వస్తున్న వరద నీటితో జూరాల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గత అర్ధరాత్రి నుండి జూరాలకు 1,50,000 క్యూసెక్కుల వరద రావడం మొదలు కావడంతో జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై గేట్లను పెంచుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల జలవిద్యుత్కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరద నీటిలో 38 వేల క్యూసెక్కులను వినియోగించుకొని విద్యుతుత్పత్తి చేపడుతున్నట్టు వారు తెలిపారు. జూరాలకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, దీంతో గేట్ల ద్వారా వరద నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నట్టు జూరాల అధికారులు తెలిపారు.
సందర్శకుల తాకిడి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో అర్ధరాత్రి నుండే అధికారులు 20 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు వదులుతుండడంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు జూరాలకు తరలివస్తున్నారు. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ప్రత్యేక వాహనాలతో జూరాలకు వచ్చి కృష్ణమ్మ పరవళ్లు వీక్షించారు. మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో జూరాలకు తరలివస్తుండడంతో ప్రాజెక్టంతా సందర్శకులతో కిటకిటలాడింది.

చిత్రం.... జూరాల క్రస్ట్ గేట్ల నుండి విడుదల అవుతున్న వరద నీరు.