తెలంగాణ

ప్రతికూల పరిస్థితిలోనూ పంటలు పండిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనూ పంటలు పండించే సాంకేతిక విజ్ఞానాన్ని రైతులు చేపట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేర్కొన్నారు. వాతావరణం సరిగ్గా లేకపోయినా రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు చేపట్టిన వినూత్న ప్రాజెక్టుపై సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రుతుపవనాలు అన్నివేళలా అనుకూలంగా ఉండకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షం కురుస్తూ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సేద్యం చేసేందుకు మహబూబ్‌నగర్ పాత జిల్లాలోని 15 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ‘రెసిలియెంట్ అగ్రికల్చర్ హౌజ్‌హోల్డ్స్ త్రూ అడాప్షన్ టు క్లైమేట్ చేంజ్’ (ఆర్‌ఎహెచ్-ఎసిటి) ప్రాజెక్టును చేపట్టారు. జడ్చర్ల, బిజినెపల్లి, ఘన్‌పూర్ మండలాల్లోని 15 గ్రామాలను ఎంపిక చేశారు. 2016 లోనే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనులను పార్థసారథి వివరిస్తూ, సూక్షనీటిపారుదల (ఎంఐపి) ప్రధానమైందని, పెరటి కోళ్ల పెంపకం, పాడిపశువుల పెంపకం, వర్మీకంపోస్ట్, యాంత్రీకరణ, గట్లపై చెట్ల పెంపకం, పళ్ల మొక్కల పెంపకంపై రైతులు దృష్టి కేంద్రీకరించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే పంటలను సాగుచేస్తూ, రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితిలో 13 రకాలైన సాగు సంబంధ వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణపై శిక్షణ, పరిశోధనా సంస్థ (ఇపిటిఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్ బి. కళ్యాణ చక్రవర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇక్రిసాట్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డ్, పశుసంవర్థకం, పాడిపరిశ్రమ,మత్స్య, ఉద్యాన, అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

చిత్రం..పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి