తెలంగాణ

మహిళలకు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను ఎంపి కవిత కట్టుకుంటారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు నిరసన తెలపడం తప్పా? అని ఆమె మంగళవారం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. నాసిరకమైన బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మహిళలను కించపరిచారని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళలే నిరాశకు గురై స్వచ్ఛందంగా చీరలకు నిప్పంటిస్తే దానికి కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. బతుకమ్మ చీరల పేరిట ప్రజల సొమ్మును దోచుకుంటుంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? అని ఆమె అన్నారు. నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. చీరల గురించి మంత్రి కెటిఆర్‌కు ఏమి తెలుసని ఆమె ప్రశ్నించారు. మహిళలకు నాసిరకం చీరలిచ్చినందుకు మంత్రి కెటిఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చేనేత చీరలని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది వాస్తవం కాదా? ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ మహిళలకు ఎంత చీర కావాలో కూడా తెలియదా? అని ప్రశ్నించారు. నాసిరకం చీరలే కాకుండా సైజు తక్కువ ఉన్నవి ఇచ్చి అవమానపరిచారని ఆమె విమర్శించారు. కాగా టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూరత్ చీరలు తెచ్చి చేనేత చీరలని చెప్పినందున ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోజుకు రూ.200 కూలీ చేసుకునే మహిళలు దానిని వదులుకుని లైన్‌లో నిలబడి కష్టపడి చీర సాధిస్తే చివరకు అది వంద రూపాయల ధర కూడా లేదని ఆయన విమర్శించారు.
క్షమాపణకు కోమటిరెడ్డి డిమాండ్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాసిరకం చీరలు పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 8వ నిజాం తరహాలో ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. నల్లగొండ లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమై అధిష్ఠానం అనుమతిస్తే పోటీకి సిద్ధమని ఆయన తెలిపారు. ఇలాఉండగా గాంధీ భవన్ ఆవరణలో కొంత మంది మహిళలు నాసిరకం చీరల పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని చీరలకు నిప్పంటించారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి డికె అరుణ