తెలంగాణ

చీరల కొనుగోలులో భారీగా అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: బతుకమ్మ చీరల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నందున రాష్ట్రప్రభుత్వం ఈ అంశంపై న్యాయవిచారణకు ఆదేశించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బిజెపి కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టమ్రంత్రి కెటిఆర్ మాటలు మహిళలను బెదిరించే విధంగా ఉన్నాయని , మంత్రుల బెదిరింపులకు తెలంగాణ ఆడపడుచులు భయపడరని, మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన కెటిఆర్ , మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. చీరలు బాగాలేవని ఆందోళన చెందుతున్న వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టడం ఏం ప్రజాస్వామ్యం అవుతుందని లక్ష్మణ్ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.స్కీమ్‌లు ప్రారంభించడం, స్కామ్‌లకు పాల్పడటం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే అలవాటుగా మారిందని , చీరల స్కీమ్ అవినీతిలో కూరుకుపోయిందని ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. బతుకమ్మ చీరలను చేనేతపై కాకుండా మరమగ్గాలపై చేయించారని, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని అన్నారు. పోచంపల్లి, గద్వాల, కొత్తకోట, వరంగల్, సిద్దిపేట, దుబ్బాక, నారాయణ పేట లాంటి అనేక పట్టణాల్లో చేనేత కార్మికులు ఉన్నారని, వారికి ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. బిజెపి అధికార ప్రతినిధి పుష్పలీల, మహిళామోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నాసిరకం చీరలు ఇస్తున్నారని వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు మాట్లాడుతూ చీరల ఆశ చూపించి మహిళలను అవమానించారని అన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్