తెలంగాణ

ఇద్దరు చైన్ స్నాచర్ల ఆరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఆరు బంగారు గొలుసులు, హుందాయ్ సాంత్రో కారు, కారం పొడి ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక నుంచి వచ్చి హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నివాసముంటున్న నటకార్ నర్సయ్య, అనంతపురం నుంచి వచ్చి యూసుఫ్‌గూడలో నివాసముంటున్న పి సత్యనారాయణ చారిలను పోలీసులు అరెస్టు చేశారు. కెబిఆర్ పార్క్‌కు వాకింగ్ నిమిత్తం వచ్చే వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ, వారి కళ్లలో కారం పొడి చల్లి మెడలోని బంగారు గొలుసులను అపహరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడగా, రెండు ఇళ్ల దోపిడీ కేసులో నిందితుడు. అయితే నర్సయ్య దొంగిలించిన బంగారు గొలుసులను గోల్డ్‌స్మిత్ సత్యనారాయణ చారికి ఇచ్చే వాడు. దీంతో గోల్డ్‌స్మిత్ సత్యనారాయణ చారి బంగారు గొలుసులను కడ్డీలుగా మార్చి అమ్మే వాడు. బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో నర్సయ్య తల్లి మిడ్ సర్వెంట్‌గా పని చేస్తోంది. ఇదే అనువుగా చేసుకుని ఆ ఇంటి యజమానికి చెందిన ఓ హుందాయ్ కారును దొంగిలించాడు. పలువురు మహిళలు, ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు నిందితులను పట్టుకుని సుమారు రూ. 8 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసిపి ఎన్ మురళీ తెలిపారు.