తెలంగాణ

బిజెపికి అధికారం పగటి కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో బిజెపికి అధికారం రావడం పగటి కలేనని, ఆ పార్టీ టు-లెట్ బోర్డు పెట్టుకొని ఎదురు చూస్తున్నా ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా లేరని టిఆర్‌ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. ప్రభుత్వం చేసే ప్రతీ పనికి విపక్షాలు ఇలాగే అడ్డుపడితే మహిళలు చీపురుకట్టలతో తరిమి కొట్టే రోజులు వస్తాయని టిఆర్‌ఎస్ హెచ్చరించింది. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలంగాణ ప్రభుత్వంపైనా, టిఆర్‌ఎస్ పార్టీపైనా చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రులు ఎప్పుడు ప్రశంసించలేదని పచ్చి అబద్దాలు ఆడారని కర్నే ప్రభాకర్ అన్నారు. మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కొత్త రాష్టమ్రైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని కేంద్ర మంత్రులు ప్రశంసించిన విషయం రాంమాధవ్‌కు తెలియదా? అని కర్నే ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంమాధవ్, అక్కడ బిజెపికి భవిష్యత్ లేదని అర్థమై, పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు ప్రభుత్వం చీరలు పంచితే ఓర్వలేని విపక్షాలు వాటిని లాక్కొని మరీ తగులబెట్టడం ఉన్మాద చర్య అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. మహిళలు ఆనందంగా చీరలు తీసుకొని వెళ్తుంటే వాటిని లాక్కొని తగుల బెట్టేవారిని ఉన్మాదులు కాక మరేమంటరనీ ఆయన ప్రశ్నించారు. కోటి ఆరు లక్షల మంది మహిళలకు చీరలు పంచడం అనేది చిన్న విషయం కాదని, అన్ని చీరలు రాష్ట్రంలో లేకపోవడం వల్లనే పక్క రాష్ట్రం నుంచి తెప్పిస్తే ఇంత రాద్ధాంతమా? అని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. చీరల పంపిణీ వెనుక నేతన్నలకు ఉపాధి కల్పించిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏది చేసినా ఇలాగే రాద్ధాంతం చేస్తూ పోతే భవిష్యత్‌లో విపక్షాలను మహిళలు చీపుళ్లతో తరిమికొట్టే రోజు మరి ఇంకెంత కాలం లేదని ఆయన హెచ్చరించారు.