తెలంగాణ

అవినీతిని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: జైళ్లలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని, అలాంటి వారిపై చర్యలు తీసుకున్నామని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ స్పష్టం చేశారు. జైళ్లశాఖలో అవినీతి సహించబోమని, అవినీతిరహిత జైళ్లుగా మార్చడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. ఖైదీలలో మార్పు తేవడం కోసం అనేక పథకాలు చేపట్టామని, ఖైదీల్లో సత్ప్రవర్తన, వారికి ఉపాధి కల్పించడం, వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని డైరెక్టర్ జనరల్ వికె సింగ్ అన్నారు. మంగళవారం జైళ్లశాఖ సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. విద్యాదానం, ఉన్నతి వంటి పథకాల ద్వారా ఖైదీల్లో మార్పు తీసుకురాగలిగామన్నారు. మహిళలకు ఎక్కడా లేని విధంగా పెట్రోలు బంక్‌లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని, అదేవిధంగా పురుష ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. తెలంగాణలోని జైలు బిల్డింగ్‌ల మరమ్మతులు, భవన నిర్మాణాలపై చర్చించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జైళ్లను రిసార్ట్స్‌గా మాదిరిగా మార్చేందుకు తగు ప్రతిపాదనలు, జైళ్లశాఖకు ఆదాయ వనరులు పెంపొందించుకోవడం వంటి వాటిపై చర్చించినట్టు డిజి తెలిపారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో మార్పు వచ్చిందని, నేరాల సంఖ్య కూడా తగ్గిందని డిజి వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. జైళ్లల్లో సిబ్బంది కొరత, పెండింగ్ ప్రదిపాదనలపై ప్రభుత్వంతో చర్చించినట్టు ఆయన వివరించారు.