తెలంగాణ

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 19: ప్రజలకు బాసటగా నిలుస్తూ తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ రైతు బాటలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాతో పాటు టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క, సిఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పొన్నం ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కార్యకర్తలే పార్టీకి పునాదులని, వారు అంకితభావంతో కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని కుంతియా అన్నారు. రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన పునరుద్ఘాటించారు. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ కాంగ్రెస్ కమాండర్లుగా పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్నారని, వారికి కార్యకర్తలు బాసటగా నిలుస్తూ కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. గడిచిన నాలుగేళ్ల పాటు రైతాంగాన్ని విస్మరించిన కెసిఆర్ సర్కార్, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతులు ఎక్కడ వాత పెడతారోననే భయంతో రైతు సమన్వయ కమిటీల పేరుతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని విమర్శించారు. ఎకరానికి 4 వేల రూపాయల చొప్పు న ముందస్తు పెట్టుబడులను అందించడం బాగానే ఉన్నప్పటికీ, అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచిన తరువాత ఎన్నికలకు ఏడాది ముందు అమలు చేస్తామనడం తెరాస దమన నీతికి అద్దం పడుతోందన్నారు. ముందస్తు పెట్టుబడులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియలో రైతు సమన్వయ సమితులను భాగస్వామ్యం చేస్తే ఎంతమాత్రం సహించబోమని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన కాంగ్రెస్ హయాంలో అనేక పర్యాయాలు జరిగిందని, దీనిని గుర్తించకుండా తానే మొట్టమొదటగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్టుగా ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పైపెచ్చు రైతు సమన్వయ సమితుల పేరుతో తెరాస శ్రేణులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల స్థానిక సంస్థల హక్కులు కాలరాయబడతాయని, రెవె న్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని ఆక్షేపించారు. సేద్యపు రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన ఫలితంగా తెరాస ప్రభుత్వ హయాంలో 3500 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, కనీసం ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా పాలకులు పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.

చిత్రం..కార్యకర్తల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి