తెలంగాణ

కవిత ఖజానా నింపేందుకే బతుకమ్మ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి ముద్దుల కూతురు కవితమ్మ ఖజానా నింపేందుకే బతుకమ్మ ఉత్సవాల పేరిట ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద ఆరోపించారు. విపక్ష పార్టీల మహిళలపై ప్రభుత్వ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారిని కించపరచడా న్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బంగారు బతుకమ్మ కాదు..ప్రభుత్వ తీరుతో నిరసనల బతుకమ్మకు మహిళా లోకం స్వాగతం పలుకుతోందని ఎద్దేవా చేశారు. సద్దుల కానుకగా చీరలు పంపిణీ చేస్తూ, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పండగకు ధరించే నేత చీరలిస్తామని ప్రకటనలు చేసి, గుజరాత్ నుంచి టోకుగా కిలోలకొద్దీ కొనుగోలు చేసిన పాలిస్టర్ చీరలను పంచి ఆడజాతిని అవమానానికి గురిచేశారని దుయ్యబట్టారు. చీరల కోసం రూ.200 కోట్లు వెచ్చించామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సగానికి పైగా మొత్తాన్ని కమీషన్ల పేర కుమ్మేసిందని వ్యాఖ్యానించారు. సద్దుల పండుగను గ్రామీణ వాతావరణంలో జరుపుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల కోసం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఎంపి కవిత జేబు సంస్థ జాగృతికి మాత్రం కోట్లకు కోట్లు విడుదల చేయడం శోచనీయమన్నారు. నాసిరకం చీరలు పంపిణీ చేయడంతోనే ఆగ్రహించిన మహిళలు కాల్చివేస్తుంటే, అది విపక్షాల పనేనంటూ బద్‌నాం చేయడం సిగ్గుచేటన్నారు. తెరాస ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ, మహిళాలోకాన్ని కించపరుస్తున్నా పట్టింపులేని ముఖ్యమంత్రి వైఖరిని విమర్శిచారు. అనంతరం నేరెళ్ళ బాధితులను ఆదుకోవాలంటూ, కలెక్టరేట్ ఎదుట గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఆమె పాల్గొన్నారు.