తెలంగాణ

గోదావరి జలాలతో సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, సెప్టెంబర్ 19: మిడ్‌మానేరు, ఎల్లపల్లి ప్రాజెక్టులతో కరవు, కల్లోలిత ప్రాంతమైన సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, గోదావరి జలాలతో రైతుల బీళ్లు సుభిక్షం చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మిడ్‌మానేరు నుంచి గుడిచెరువుకు రూ.17 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి ఆయన మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే సంవత్సరం నుంచి వరదకాలువలో నీటి ప్రవాహంతో నిండుగా ఉంటుందని... ఓటిలు పెట్టి చెరువులను నింపుతామని, మోటార్లు పెట్టుకొని నీళ్లను పొలాలకు పారించుకోవచ్చని పేర్కొన్నారు. వెయ్యికోట్లతో ఎస్‌ఆర్‌ఎస్‌పి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, వచ్చే సంవత్సరం వరకూ ఈ పథకం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల వరద కాలువకు పుష్కలంగా నీటి సౌలభ్యం ఉంటుందని, లక్షా ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుందని ఆయన భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశామని గుర్తు చేశారు. వచ్చే సంవత్సరంలోగా మిడ్‌మానేరు పూర్తిచేసి 4 టిఎంసిల నీటితో నింపుతామని అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో తాగునీటికి కష్టాలు ఉండవని, మిడ్‌మానేరు పూర్తయితే 25 వేల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుందని తెలిపారు. మధ్యమానేరు నిర్మాణం వల్ల నష్టపోయిన చివరి మనిషి వరకూ పరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చా రు. పైరవీలకు తావులేకుండా పాదర్శకంగా పరిహారాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వాడా వైస్ చైర్మన్ పురుషోత్తమరెడ్డి పాల్గోన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు