తెలంగాణ

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత ఉండడానికి గల కారణాలేమిటో వచ్చే నెల 24వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మెడికల్ కౌన్సిల్‌ను ఆదేశించింది. సోషల్ అవేర్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జె. హరికృష్ణ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జె. ఉమాదేవితో కూడిన డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదన విన్నది. ప్రభుత్వ వైద్య కశాళాలల్లో ప్రొఫెసర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు 70 ఏళ్ళ వరకూ ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించిందని పిటీషనర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని పిటీషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యం రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ అర్హత ఎండి/ఎంఎస్/ఎంసిహెచ్/డిఎం ఉండాలని, వైద్య వృత్తిలో పనె్నండేళ్ళ అనుభవం ఉండాలని, అయినా చాలా మంది డాక్టర్లు 45వ ఏటనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవుతున్నారని, 58 ఏళ్ళకే పదవీ విరమణ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చాలా మంది ప్రొఫెసర్లుగా అనుభవం గడించి ఆ తర్వాత ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారని, అందుకు కారణం అక్కడ పదవీ విరమణ వయస్సు 70 ఏళ్ళు ఉండడమేనని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి ప్రతి ఏడాది సుమారు 80 మంది ప్రొఫెసర్లు 58 ఏళ్ళకు పదవీ విరమణ చేసి ఆ తర్వాత ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లుగా చేరుతున్నందున ప్రభుత్వ వైద్య కళాశాలలకు నష్టం వాటిల్లుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బెంచ్ స్పందిస్తూ దీనికి కారణాలేమిటో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులను ఆదేశించింది.