తెలంగాణ

హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన జలగలంచ అటవీ ప్రాంతంలో గత శనివారం అటవీ అధికారులు గిరిజనులపై జరిపిన దాడి సంఘటనను రాష్ట్ర మానహక్కుల కమిషన్‌తో పాటు జాతీయ గిరిజన హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు టిటిడిపి నేతలు తెలిపారు. బుధవారం బాధిత గిరిజనులు హైదరాబాద్‌లో టిటిడి కేంద్ర కార్యాలయానికి రాగా వారిని టిటిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా టిటిడిడి తరఫున బాధిత గిరిజనులకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. రేవంత్, రమణ మాట్లాడుతూ ఈ దాడి వెనుక కెసిఆర్, కెటిఆర్‌ల కుట్ర ఉందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం గిరిజన జాతిని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో గుత్తికోయల ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు అటవీ భూమి ఖాళీ చేసి మైదాన ప్రాంతంలోకి వెళ్లమని చెబితే ఎలా వెళ్లి నివశిస్తారని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, యురేనియం ఉండడంతో అక్కడి నుంచి చెంచు గిరిజనులను వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వజ్రాలను వెలికి తీసేందుకు ఒక అంతర్జాతీయ సంస్థకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని చెప్పారు. 5వ షెడ్యూల్‌లోని అటవీ ప్రాంతంలో ఇసుక, ఇతర ఖనిజాలు తవ్వుకునే హక్కు కేవలం ఆదివాసీ గిరిజనులకు మాత్రమే ఉండాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాడ్వాయి అడవుల్లో జరిగిన గిరిజనులపై దాడి మంత్రి కెటిఆర్‌కు తెలిసే జరిగిందని అన్నారు. మహిళల బట్టలు లాగి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మియాపూర్ భూ కుంభకోణం, డ్రగ్స్ వ్యవహారం, నేరెళ్లలో పోలీసుల రాక్షసత్వం, ఇప్పుడు గుత్తికోయలపై అటవీశాఖ అధికారుల దాడి ఇలా ఒకదాని గురించి వింటుండగానే మరొకటి బయటపడుతున్నాయని అన్నారు. తాజాగా బతుకమ్మ చీరల వ్యవహారం ఇలా ఒక్కో ప్రభుత్వ దుర్మార్గం బయటపడుతోందని అన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.