తెలంగాణ

టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్థుల రాష్ట్ర సమావేశం నిర్ణయించింది. బుధవారం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 4679 పాఠశాలలు మూతపడనున్నాయని అన్నారు. 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందని ఆయన తెలిపారు. సభకు జాక్ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షత వహించారు.