తెలంగాణ

కూలీల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: మాజీ ఎంపి పొన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళేశ్వరం పనుల్లో జరిగిన ప్రమాదంలో 7 మంది మృతి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు సమీక్షించిన మర్నాడే ఘటన జరిగిందని పొన్నం బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
హత్యకు టిఆర్‌ఎస్ కారణం: పొంగులేటి
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త వేముల శ్రీనివాస్ హత్యకు స్థానిక టిఆర్‌ఎస్ నేతలే కారణమని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నడిరోడ్డుపై హత్య చేస్తే కూడా ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.