తెలంగాణ

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: అగ్నిమాపక వారోత్సవాలను గురువారం ఎఫ్‌ఎసి డైరెక్టర్ లక్ష్మిప్రసాద్ ప్రారంభించారు. గురువారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 20 దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా లక్ష్మిప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో అనేక మంది అధికారులు తమ ప్రాణాలు వదిలారన్నారు. అగ్నిప్రమాదాలు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ టి వెంకన్న, ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.