తెలంగాణ

అయిరి మాజీ ఎమ్మెల్యేపై మావోల మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 14: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర పరిధిలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అలజడి సృష్టించిన సంఘటనలో మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ నాకేసే నానాజీ (38) మృతి చెందాడు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం సరిహద్దు గూడెం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర పరిధిలో జరిగిన నక్సల్స్ ఘాతుక చర్యలో మాజీ ఎమ్మెల్యే అత్రం దీపక్ తృటిలో తప్పించుకున్నారు. గడ్చిరోలి జిల్లా అయిరి మాజీ ఎమ్మెల్యే దీపక్ అత్రంను లక్ష్యంగా చేసుకున్న నక్సలైట్లు గురువారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పెట్రేగిపోయారు. ఇంతలోనే ప్రతిఘటించిన అంగరక్షకుడు నానాజీని నక్సల్స్ తుపాకీతో కాల్చిచంపారు. రేపన్‌పల్లి పోలీ సు స్టేషన్ పరిధిలో గల చెల్లెవాడ గ్రామానికి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే దీపక్ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీపక్ మూత్ర విసర్జన కోసం కార్యక్రమం నుండి బయటకు వచ్చిన క్రమం లో అప్పటివరకు కాపుకాసిన నలుగురు మావోయిస్టులు సాధారణ ప్రజల మాదిరిగానే గన్‌మెన్ వద్దకు వచ్చి ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో గన్ మెన్ నానాజీ అక్కడే కుప్పకూలిపోగా, కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా అక్కడి గ్రామస్తు లు అరుపులు కేకలతో పరుగులు తీశారు. ఈ సంఘటనతో మాజీ ఎమ్మెల్యే తృటిలో తప్పించుకుని పరారయ్యారు. పరిస్థితిని గమనించిన మావోయిస్టులు మృతుడు గన్‌మెన్ నానా జీ వద్ద ఉన్న తుపాకీని తీసుకుని పారిపోయారు.