తెలంగాణ

కాటేస్తున్న కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కరవుకోరల్లో చిక్కుకుంది. 443 మండలాల్లో కరవు వికటాట్టహాసం చేస్తోంది. కాని కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రం 231 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడంతో మిగతా మండలాలు కరవు సహాయక చర్యలు నోచుకోక సతమతమవుతున్నాయి. ఆశించిన స్ధాయిలో వర్షపాతం నమోదుకాకపోవడం, నిప్పుల కొలిమిలా రాష్ట్రం తయారు కావడంతో ఊహించని రీతిలో భూగర్భ జల మట్టాలు అన్ని మండలాల్లో అడుగంటాయి. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కూడా కరవుపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. కరవు సహాయక చర్యల అమలు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది నవంబర్ 15న రాష్ట్రప్రభుత్వం 231 కరవు మండలాలను ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నైరుతి రుతు పవనాల్లో వచ్చిన వర్షపాతం ఆధారంగా కరవు మండలాలను ప్రకటించారు. అలాగే ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన పంట ఉత్పత్తిని ప్రాతిపదికగా తీసుకుని కరవుమండలాలను ఎంపిక చేస్తారు. సాధారణ వర్షపాతం 713.6 ఎంఎం ఉండాలి. కాని 610.8 వర్షపాతం నమోదైంది. అంటే 14 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. వర్షపాతం, ఖరీఫ్ పంట ఉత్పత్తి నిబంధనలే అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించేందుకు అడ్డంకిగా మారాయి. గత ఏడాది కరవు మండలాలుగా 231 మండలాలను ప్రకటించే సమయానికి ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్ధితులు ఉంటాయని కలలో కూడా ఊహించలేదు. కరవు పరిస్ధితిపై రాష్ట్రప్రభుత్వం అలసత్వం వహించిందని, కేంద్రానికి సకాలంలో నివేదికలు పంపలేదని విపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. చివరకు కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదిక ఆధారంగా కేంద్రం రూ.791 నిధులను ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం కరవుతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 3064 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరింది. కేంద్రం ఇంతవరకు రాష్ట్రానికి తొలుత రూ. 56 కోట్లు, ఆ తర్వాత రూ. 328 కోట్లను విడుదల చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 150రోజులకు పెంచారు. తొలుత కేంద్రం విడుదల చేసిన రూ. 56 కోట్లను వివిధ జిల్లాలకు మంచినీటి సదుపాయం నిమిత్తం కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన రూ. 328కోట్లను వ్యవసాయరంగంలో ఇన్‌పుట్ సబ్సిడీకి వాడుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశంచింది. కాని రూ. 989 కోట్ల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ కావాలని వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అడుగుతున్నారు. ఈ ప్రతిపాదన ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని సమాచారం. హైదరాబాద్‌లో కరవులేక పోయినా నిప్పుల కొలిమిలా తయారై తొలిసారిగా ఎండలు ప్రకృతి విపత్తుగా పరిణమించింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్ధితి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 5.78 లక్షల కుటుంబాలకు 3911 గ్రామ పంచాయితీల్లో పని కల్పిస్తున్నారు. 150 రోజులకు పని దినాలను కేంద్రం పెంచడం వల్ల కొద్దిలో కొద్దిగా ఈ కుటుంబాలకు మేలు చేసినట్లయింది. పశుగ్రాసం కొరత నివారణకు కేంద్రం అత్యవసరంగా రూ.75 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రం లేఖ రాసింది. దీనికి కేంద్రం నుంచి స్పందన లేదు. కృష్ణా బేసిన్‌లో మొత్తం 640.66 టిఎంసి కెపాసిటీకి కేవలం 156.75 టిఎంసి నీరే అందుబాటులో ఉంది. ఈ నీళ్లను పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూరాలలో 11.94 టిఎంసికి కేవలం 2.84 టిఎంసి, శ్రీశైలంలో 215.81 టిఎంసికి 23.37 టిఎంసి, నాగార్జునసాగ్‌లో 312.05 టిఎంసికి 127.13 టిఎంసి నీటి లభ్యత ఉంది. తుంగభద్రలో 100.86 టిఎంసికి 3.41 టిఎంసి నీటి లభ్యత ఉంది. దాదాపు 14 టిఎంసి నీరు రాజోలిబండ కింద తెలంగాణకు రావాల్సి ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 790 అడుగుల నీటి మట్టం వద్ద 23.37 టిఎంసి నీరే నిల్వ ఉంది. ఈ నీటిలో నుంచి 4 టిఎంసి నీటిని విడుదల చేసి తెలంగాణకు ఒక టిఎంసి, ఆంధ్రాకు 3 టిఎంసిని నాగార్జునసాగర్ కాల్వల ద్వారా ఇస్తున్నారు. కృష్ణా నదీ జలాల బోర్డు ఆదేశం లేకపోయినా, రెండు రాష్ట్రాల అధికారులు ఒక అవగాహనకు వచ్చి ఈ నీటిని ఆదివారం విడుదల చేశారు. తెలంగాణ భూగర్భ జల నీటి మట్టం విభాగం రాష్ట్రంలో 182 మండలాల్లో మంచినీటి పరిస్ధితి ప్రమాదంలో పడింది. 335 మండలాల్లో భూగర్భ జల మట్టాలు ఊహించనిదాని కంటే లోతుకు పడిపోవడంతో పరిస్ధితి అయోమయంగా తయారైంది.