రాష్ట్రీయం

ఇక కరెన్సీ స్మగ్లింగ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: బంగారం తెస్తే.. పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు స్మగ్లర్లు కొత్త పంథా వెతుక్కున్నారు. అది భారత కరెన్సీని ఇతర దేశాలకు భారీగా తరలించడం..గుట్టుచప్పుడు కాకుండా హవాలా మార్గాల్లో లావాదేవీలు సాగించడం. ముఖ్యంగా పశ్చిమాసియా దేశా ల్లో భారత కరెన్సీకి డిమాండ్ ఉండటంతో.. ఇక్కడి నుంచి భారీగా దీన్ని తరలించేందుకు ఆయా దేశాల కరెన్సీతో దిగుతున్నారు. ఈ గుట్టూ రట్టయింది. హవాలా అపరేటర్ల ద్వారా హైదరాబాద్ నుంచి తరలుతున్న భారత కరెన్సీపై విదేశీ వ్యాపారులు, స్మగ్లర్లు దృష్టి సారించారు. గడచిన మూడు నెలల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి రూ.3.56 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ నలుగురిని అరెస్టు చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపారు. అలాగే కిలోల కొద్దీ బంగారం దిగుమతి చేసుకుంటూ వ్యాపారం సాగిస్తున్న స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కిపోతుండడంతో స్మగ్లర్లు కొత్తగా హవాలా ముసుగులో విదేశీ కరెన్సీని దిగుమతి చేస్తూ భారత్ కరెన్సీని తరలిస్తున్నారు. భారత కరెన్సీ విదేశాల్లో ఎక్స్‌ఛేంజ్‌కు అనుకూలంగా ఉండడంతో కరెన్సీ స్మగ్లర్లు హవాలా ఆపరేటర్ల ద్వారా కరెన్సీ వ్యాపారం సాగిస్తున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి దుబాయి, షార్జాకు వెళ్లే ప్రయాణికుల వద్ద భారత కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా దుబాయి దిర్హమ్స్, యుఎస్ డాలర్లు, సౌది రియాల్స్, ఒమాని రియాల్స్‌ను పట్టుకున్నామని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఖతర్ రియాల్స్, కువైట్ దినార్‌లను భారత్‌కు దిగుమతి చేసుకుంటూ భారత్ కరెన్సీని విదేశాలకు తరలిస్తున్నారు. విదేశీ కరెన్సీతో పోలిస్తే భారత్ కరెన్సీ కన్వర్టింగ్‌కు, మార్పిడికి అతి సునాయసం కాబట్టి విదేశాల్లో భారత కరెన్సీకి మంచి డిమాండ్ ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఒక కువైట్ దినార్‌కు భారత కరెన్సీ రూ. 220.41 ఐఎన్‌ఆర్‌ఐ, కాగా ఒక ఒమాని రియాల్‌కు రూ. 172.69 ఐఎన్‌ఆర్ ఉండడంతో హైదరాబాద్ నుంచి బ్రీఫ్ కేసుల్లో విదేశీ కరెన్సీని దిగుమతి చేసుకుంటూ హవాలా రూపంలో పశ్చిమాసియా దేశాలకు భారత కరెన్సీతో స్మగ్లర్లు వ్యాపారం సాగిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
విదేశాలకు వెళ్లే వారికి తమ వెంట తీసుకెళ్లేందుకు భారత కరెన్సీ కేవలం రూ. 7,500లకు మాత్రమే అనుమతి ఉంది. దీంతో దుబాయి, షార్జా, ఖతర్, ఒమానిలలో భారత కరెన్సీ మార్పిడికి మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు అక్రమ హవాలా వ్యాపారాలకు పాల్పడుతున్నారు.విదేశీ ఉత్పత్తులు, వ్యాపారాల్లో పెట్టుబడులకు ఈ కరెన్సీని వినియోగిస్తున్నారని, దీంతో విదేశాల్లో భారత కరెన్సీకి మంచి మార్కెట్ ఏర్పడడంతో హవాలా వ్యాపారులు భారత కరెన్సీతో అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. హవాలా వ్యాపారులు కొరియర్లను ఏర్పాటు చేసుకొని సాగిస్తున్న భారత కరెన్సీ వ్యాపారం పాతబస్తీలోని చార్మినార్ వద్ద నడుస్తున్నట్టు సమాచారం. భారత కరెన్సీతో హవాలా వ్యాపారం సాగిస్తున్న స్మగ్లర్లు ఎవరు..ఎక్కడి నుంచి ఈ వ్యాపారం సాగుతోంది..అన్న అంశం ఆరా తీస్తున్నట్టు ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.