తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: టిడిపి, కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకుండా దగా చేసాయని, ఇప్పుడేమో తమ ప్రభుత్వం వాటిని నిర్మిస్తుంటే అడ్టుకుంటున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కూడా వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసాయన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, జడ్చర్ల మండలాలకు చెందిన పలువురు టిడిపి, కాంగ్రెస్ నాయకులు మంత్రుల సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టుల పట్ల గత ప్రభుత్వాలు వివక్ష చూపాయన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2005లో భూమి పూజ చేస్తే 2014 వరకు కూడా పూర్తి కాలేదన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉండగా 10 ఏళ్ళు గడిచినా పూర్తి కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్వాల నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు పల్లెర్లు మొలిచిన ఎండు భూములు కనిపించాయన్నారు. ఈ బీళ్లలో సాగునీరు పారించేందుకు ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని ఈటల ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మహబూబ్‌నగర్ జిల్లాకు 75 శాతం సాగునీటిని అందిస్తున్నామన్నారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు పెన్షన్ల కోసం రూ.800 కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రాజెక్టులకు ఎంత డబ్బు ఖర్చు అయినా వెనుకాడకుండా నిర్మిస్తున్నామని, ప్రజల కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, అన్ని రంగాలల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ఈటల అన్నారు. రైతుల కష్టాలను శాశ్వతంగా దూరం చేయడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకు వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడిని సమకూర్చబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల కంటే ఎక్కువ లాభపడేది మహబూబ్‌నగర్ జిల్లానేనని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా టిడిపి, కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ప్రసంగిస్తున్న మంత్రి ఈటల రాజేందర్. చిత్రంలోమంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు