తెలంగాణ

19నే దీపావళి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: దీపావళి పండగ సెలవును 2017 అక్టోబర్ 19 న నిర్ణయిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆ రోజును సెలవుగా ప్రకటించింది. అలాగే నరక చతుర్ధశిని అక్టోబర్ 18 గా గుర్తిస్తూ, ఆరోజును ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలీడే) గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీఓ జారీ అయింది. వాస్తవంగా 2017 సంవత్సరంలో సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం 2016 నవంబర్ 22 న ప్రకటించింది. ఆనాడు చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 17 న నరక చతుర్ధశిగా గుర్తిస్తూ ఐచ్ఛిక సెలవుగా, ఆ మరురోజు అంటే 18 ని దీపావళిగా గుర్తిసూ, సాధారణ సెలవుగా ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. ప్రభుత్వం రూపొందించిన క్యాలెండర్లలో ఇవే తేదీలను ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పండితులు చేసిన సూచన ప్రకారం గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రకటించిన సెలవుల తేదీలను ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. ఈ అంశంపై ఎండోమెంట్స్ శాఖ కమిషనర్ 2017 అక్టోబర్ 12 న ప్రభుత్వానికి లేఖ రాశారు. 2017 లో దీపావళిని అక్టోబర్ 19 న, నరక చతుర్ధశిని అక్టోబర్ 18 న గుర్తిస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం నరక చతుర్దశి, దీపావళి సెలవురోజుల్లో మార్పు చేశారు. అక్టోబర్ 18 న నరక చతుర్దశి, అక్టోబర్ 19 న దీపావళిగా గుర్తిస్తున్నామని, ఈ రెండురోజులను ఐచ్ఛిక సెలవుగా, సాధారణ సెలవుగా ప్రకటిస్తున్నామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో జీఓ (జీఓఆర్‌టి నెంబర్ 2139) ను సోమవారం జారీ చేశారు.