తెలంగాణ

అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షుడిగా కేశవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: అంతర్జాతీయ విత్తన సలహా మండలి (ఇస్తా) అధ్యక్షుడిగా డాక్టర్ కె. కేశవులు ఎన్నికయ్యారు. కేశవులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ విత్తన సలహా మండలిలో ప్రముఖ సంస్థలకు చెందిన ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ సంస్థ ఇస్తాకు అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులను రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ తదితరులు సమక్షంలో మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్ర శాస్తవ్రేత్తకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం శుభసూచన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుఆశయమైన ‘తెలంగాణ-ప్రపంచ విత్తన భాండాగారం’గా పేరు తెచ్చుకునేందుకు కేశవులు ఎన్నిక దోహదపడుతుందని మంత్రి పోచారం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ సంచాలకులుగా డాక్టర్ కేశవులు 2015 డిసెంబర్ 2న బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సంస్థలో పలు సంస్కరణలు చేపట్టారు. విత్తనోత్పత్తిదారులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు దేశంలోనే మొదటి పర్యాయం ఆన్‌లైన్ విధానాన్ని 2016 లో కేశవులు ప్రారంభించారు.
నకిలీ విత్తనోత్పత్తిదారుల చర్యలకు కళ్లెం వేశారు. ఇస్తా డిసిగ్నేటెడ్ మెంబర్‌గా, సాంకేతిక కమిటీలో సభ్యుడిగా, పాలక మండలిలో సభ్యుడిగా పనిచేశారు. ఇస్తా నేతృత్వంలో 2019 లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ఇక్కడ నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయంలో కేశవులు పాత్ర కీలకమైంది. ఇస్తా 93 ఏళ్ల చరిత్రలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరగడం ఆసియాలోనే మొదటి సారికావడం గమనార్హం.