తెలంగాణ

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 16: గత వారం రోజులుగా కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలతో పాటు బీమానది వరద నీరు తోడు కావడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుండి జూరాల ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో 318.450 మీటర్లస్థాయిలో నీరు నిల్వ ఉండగా, కుడి, ఎడమ కాలువలకు సాగునీరు, జూరాల జలవిద్యుత్కేంద్రానికి విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 45 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుండి 1,58,600 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నట్టు జూరాల అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూరాల ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున నీటిని దిగువకు వదులుతుండడంతో శ్రీశైలం మల్లన్న వైపు కృష్ణమ్మ బిరబిరమంటూ పరవళ్లు తొక్కుతూ కృష్ణానది ప్రాంతాల వైపు పరుగెడుతోంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల వద్ద కూడా వరద నీటి ఉధృతి కొనసాగుతుండడంతో అక్కడి ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని నిల్వ చేసుకొని దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాలకు వస్తున్న వరద మరో పది రోజుల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల జలవిద్యుత్కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా జెన్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నారు.

చిత్రం..18 గేట్లు ఎత్తి జూరాల ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేసిన దృశ్యం