తెలంగాణ

బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సదస్సుకు మంత్రి కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావుకు మరొక ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది. దుబాయ్-యూఏఇకి చెందిన ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా- యూఏఇ భాగస్వామ్య సదస్సులొ పాల్గొనాల్సిందిగా మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు ఇండియాతో పాటు గల్ఫ్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు 800 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దుబాయ్-యూఏఇ దేశాలతో భారత వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31న దుబాయ్‌లో జరిగే ఈ సదస్సులో ప్రత్యేకంగా 30వ తేదీన వివిధ దేశాలకు చెందిన మంత్రులతో ఏర్పాటు చేసారు. భారత్-గల్ఫ్ దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, విధానాలు, పర్యాటకం తదితర అంశాలపై సదస్సులో ప్రసంగించాల్సిందిగా మంత్రి కెటిఆర్‌కు పంపిన ఆహ్వానంలో కోరారు.