తెలంగాణ

చారిత్రక కట్టడాలను రక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: చారిత్రక నిర్మాణమైన మక్కామసీదును ప్రభుత్వ సలహాదారు, సెక్రటరీ ఏకె ఖాన్, ఒమర్ జలీల్ మంగళవారం సందర్శించారు. మక్కామసీదు మరమ్మతు పనులను వారు పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్మాణాల మరమ్మతులకు రూ. 8.48 కోట్లు మంజూరు చేసింది. దీనిలో భాగంగానే చార్మినార్, మక్కామసీదుల మరమ్మతులు చేపట్టారు. కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన వారు పలు సూచనలు చేశారు. వీరితోపాటు ఆర్కియాలజీ డైరెక్టర్ విశాలాక్షి, సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్దిఖీ, ఇంజనీర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చారిత్రక కట్టడాలను రక్షించుకోవాలని, వాటికి చేపట్టిన మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.

చిత్రం..మక్కామసీదు మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ సలహాదారు ఏకె ఖాన్, జమీల్ తదితరులు