తెలంగాణ

పేద బ్రాహ్మణ పిల్లలకు ఫీజు చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీ-రీఇంబర్స్ చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (టిబిఎస్‌పి) నిర్ణయించింది. టిబిఎస్‌పి ఎగ్జిక్యూటివ్ కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమై వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిషత్ చైర్మన్ డాక్టర్ కె వి రమణాచారితో పాటు సభ్యులు సముద్రాల వేణుగోపాలాచారి, క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు, పి. సతీష్, సువర్ణ సులోచన, పరిషత్ సిఇఓ కె. చంద్రమోహన్ తదితరులు మీడియా ప్రతినిధులకు వివరించారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబాలకే ఫీ-రీఇంబర్స్‌మెంట్ వర్తిస్తుందని, విద్యార్థుల తల్దిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో ఏటా రెండు లక్షల రూపాయలు ఉండాలని వివరించారు. పరిషత్ చేపట్టిన వివిధ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని రమణాచారి తెలిపారు. సరస్వతి విద్యా ప్రశస్తి పథకం కింద ఇప్పటి వరకు 252 మంది విద్యార్థులకు సాయం అందించామని, మరో 150 మంది పేర్లను ఆమోదించామన్నారు. పదో తరగతిలో 90 శాతం మార్కులు పొందిన వారికి 7,500 రూపాయలు, ఇంటర్‌లో 90 శాతంపైగా మార్కులు పొందిన వారికి 10 వేలు, డిగ్రీలో 70 శాతంపైగా మార్కులు పొందిన వారికి 15000 రూపాయలు, పిజిలో 70 శాతంపైగా మార్కులు పొందిన వారికి 20 వేల రూపాయలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో 80 శాతంపైగా మార్కులు తెచ్చుకున్న వారికి 35 వేల రూపాయలు ఆర్థిక చేయూత ఇస్తున్నామన్నారు.
ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల వివరాలను పంపించాలంటూ డిఇఓలు, విద్యాసంస్థల యాజమాన్యాలను, పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరుతున్నామన్నారు. వివేకానంద ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద విదేశాల్లో చదుకునేందుకు వెళ్లేవారికి ఇప్పటివరు 56 మందికి చేయూత ఇచ్చామని మరో 12 మందికి త్వరలో ఇవ్వనున్నట్టు రమణాచారి తెలిపారు.
బ్రాహ్మణ్ ఎంటర్‌ప్రూనియల్ డెవలప్‌మెంట్ పథకం కింద చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన 56 మందికి ఆర్థికంగా చేయూత ఇచ్చామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఏడు గురిని లక్ష్య పథకం కింద ఎంపిక చేశామన్నారు. వాగ్దేవి పథకం కింద అభ్యర్థులను ఎంపి కేసి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. వేదపండితులు, వేదవిద్యార్థులకు కూడా చేయూత ఇస్తున్నామన్నారు. వేదపండితులకు నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తున్నామని వివరించారు. అలాగే వేదపాఠశాశల్లో చదివే విద్యార్థులకు నెలకు 500రూపాయల చొప్పున చెల్లిస్తున్నామన్నారు.
ఆరోగ్య బీమా
బ్రాహ్మణుల ఆరోగ్యం కోసం బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు చెల్లిస్తే పరిషత్ మరో 3000 రూపాయలు చెల్లిస్తుందన్నారు. నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా కల్పిస్తుందన్నారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స చేయించేందుకు బీమా కంపెనీ రెండు లక్షల వరకు బీమా కింద చెల్లిస్తోందన్నారు. దీనికి తోడుగా కార్పోరేషన్ ఐదులక్షల రూపాయల వరకు, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మరో 5 లక్షల రూపాయలు లభిస్తాయన్నారు.
ప్రొఫెషనర్లకు చేయూత
డాక్టర్లు, లాయర్లు, సిఎ తదితరులు స్వయం ఉపాధి కింద చేపట్టే పనులకు చేయూత ఇస్తామని రమణాచారి తదితరులు తెలిపారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో బ్రాహ్మణ పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సభ్యులతో చర్చిస్తున్న కెవి రమణాచారి