తెలంగాణ

త్వరలో రోడ్ మ్యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారుల అభివృద్ధికి అసెంబ్లీలో ముసాయిదా బిల్లు కీలక రోడ్ల ఆధునికీకరణకు రూ.600 కోట్లు
బ్యాంకుల కన్సార్టియం ద్వారా నిధుల సమీకరణ ఎస్‌ఒఎస్ ద్వారా మరో 2 వేల కి.మీ అభివృద్ధికి ప్రణాళికలు

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్‌డిసి సంస్థ ద్వారా తెలంగాణ రహదారుల అభివృద్థికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లు ప్రతిపాదించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం మాదాపూర్‌లోని ఎన్‌ఎసి కార్యాలయంలో తెలంగాణ రహదారుల అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆర్‌డిసి సంస్థ ద్వారా పిపిపి (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్), ఇఎపి (ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు), ఇతర రాష్ట్ర ప్లాగిషిప్ ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్ట సవరణ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలోని ముఖ్యమైన రహదారుల అభివృద్ధి కోసం
రూ.600 కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విజయ బ్యాంకు నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ద్వారా రహదారుల అభివృద్ధి కోసం నిధుల సమీకరణ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా తెలంగాణలోని ముఖ్యమైన రహదారుల అభివృద్ధి అమలుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. స్ట్రాటజిక్ ఆప్షన్స్ స్టడీ (ఎస్‌ఓఎస్) ద్వారా మరో 2000 కి.మీ నిడివి గల రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
31 జిల్లాల ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బి శాఖ, ఎల్‌ఇఎ అసోసియేట్స్ కన్సల్టింగ్ సంస్థ అధ్వర్యంలో బంగారు తెలంగాణ రహదారుల అభివృదిధ కార్యక్రమానికి (టిఆర్‌ఎకె) రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర బాహ్య వలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారులకు అదనంగా మరో రెండు వలయ రహదారులు, 3) తెలంగాణ బంగారు వలయం, 4) బంగారు మాల నడవా, 5) ఉత్తర-దక్షిణ నడవా, 6) తూర్పు-పడమర నడవా, 7) మరిన్ని తెలంగాణ ప్రగతి పథాలు (టిపిపి) (రేడియల్ రోడ్స్‌ల)లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అనుసంధానించే ఫ్లాగ్‌షిప్ కార్యక్రమంగా, బంగారు తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం (టిఆర్‌ఎకె) అని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు రహదారి అనుసంథానం మాత్రమే కాకుండా ఐదు పొరుగు రాష్ట్రాలతో చక్కటి అనుసంథానం ఏర్పడే విధంగా ఈ ట్రాక్ ప్రణాళికలు ఉంటాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ట్రాక్ పథకం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంథానం ఏర్పడి, ఆర్థిక-సామాజిక అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధనకు ఎంతో ఉపయోగం కాగలదని మంత్రి తుమ్మల వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో చైర్మన్ టి. నర్సారెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.