తెలంగాణ

తిరగబడ్డ తెరాస జడ్పీటిసిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20: తమకు విధులు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అధికార టిఆర్‌ఎస్ పార్టీ జడ్పీటిసిలు మహబూబ్‌నగర్ జిల్లాలో తిరగబడ్డారు. బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా జడ్పీటిసిలు సమావేశాన్ని బహిష్కరించడంతో సమావేశం వాయిదా పడింది. సమావేశానికి వచ్చిన టిఆర్‌ఎస్ జడ్పీటిసిలు సమావేశం హాల్‌లోకి రాకుండా తాము బహిష్కరిస్తున్నామని చెబుతూ ఆర్‌అండ్‌బి అతిథిగృహానికి చేరుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్, టిడిపి జడ్పీటిసిలు కూడా బహిష్కరిస్తున్నామంటూ తెరాస జడ్పీటిసిల చెంతకు చేరారు. జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ సమావేశం ప్రారంభించడానికి మీటింగ్ హల్‌కు రాగా నలుగురు ఎంపిపిలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మె ల్సీ దామోదర్‌రెడ్డి మాత్రమే ఉండడంతో ఖంగుతిన్నారు. జడ్పీటిసిలు బహిష్కరిం చారన్న సమాచారం తెలియడంతో చైర్మన్ కొందరు మధ్యవర్తులను జడ్పీటిసిల దగ్గరకు పంపించారు. ఇంతలోపే మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని స్వయంగా ఆయననే ఆర్‌అండ్‌బి అతిథిగృహం దగ్గరకు వెళ్లి టిఆర్‌ఎస్ జడ్పీటిసిల తో సంప్రదింపులు జరిపారు. తమ విధులు, నిధుల పట్ల స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. కొందరు జడ్పీటిసిలను మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట వేసుకుని తిరిగి జడ్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే సొంత పార్టీ జడ్పీటిసిలు ఇలా చేయడం ఏమిటని మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. చివరగా కొందరు జడ్పీటిసిలు సమావేశానికి వచ్చారు. తీరా కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ ప్రకటించారు. పెళ్లిళ్ల కారణంగానే జడ్పీటిసిలు హాజరుకాలేకపోయారని ఆయన తెలిపారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అధికార టిఆర్‌ఎస్ పార్టీ జడ్పీటిసిలే తిరగబడడం అంటే మంత్రుల అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. ఏదేమైనప్పటికీ అధికార టిఆర్‌ఎస్ జడ్పీటిసిలు తిరగబడడంతో మంత్రితో పాటు జడ్పీ చైర్మన్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అవాక్కయ్యారు.

చిత్రం మంత్రి జూపల్లి కృష్ణారావుతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్