తెలంగాణ

హైదరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్‌ను కోరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సద్బావన యాత్రను ఏ లక్ష్యంతోనైతే ప్రారంభించారో, ఆ లక్ష్యం నెరవేరే వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని టి.కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా పిలుపునిచ్చారు. గురువారం చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్బవన యాత్ర 27వ వార్షికోత్సవం జరిగింది. రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర స్మారక సమితి చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌సి కుంతియా ప్రసంగిస్తూ 1990లో రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర ప్రారంభించినప్పుడు దేశంలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అవే పరిస్థితులు ఉన్నాయని, అందుకే రాజీవ్ సద్బావన యాత్ర స్పూర్తిని కొనసాగించాల్సి ఉందన్నారు. తమ పార్టీ ప్రధాన అజెండానే లౌకికవాదమని, హైదరాబాద్‌లో మతసామరస్యం కోసం ఎంతో శ్రమించామని ఆయన తెలిపారు. క్రీడాకారుడు అజహరుద్దీన్‌కు దేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని కుంతియా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అజరుద్దీన్, సీనియర్ ఐఎఎస్ అధికారి ఎం.గోపాల కృష్ణన్‌లకు రాజీవ్ స్మారక అవార్డులు అందజేశారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, మాజీ ఎంపి వి. హనుమంత రావు తదితరులు ప్రసంగించారు.