తెలంగాణ

రేవంత్‌ను తెస్తే.. మేము వెళ్లిపోతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తాము రాజీనామా చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నాయకులు అధినాయకత్వాన్ని హెచ్చరించినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పటి నుండి తెలంగాణ కాంగ్రెస్ అతలాకుతలం అవుతున్నట్లు తెలిసింది.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి, బి.జె.పి వైపు చూస్తున్నట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి?, ఇప్పుడున్న సీనియర్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? రేవంత్‌రెడ్డితో వారు సర్దుకుపోతారా? అనే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆరా తీస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తరువాత మిగతా నాయకులందరిని డామినేట్ చేస్తారనేది అందరికి తెలిసిందే. రేవంత్‌రెడ్డి డామినేషన్‌ను తాము ఎంత మాత్రం సహించేది లేదని పలువురు సీనియర్ నాయకులు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నియమిస్తే పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంటుందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని పక్కన పెట్టి రేవంత్‌రెడ్డిని అందలం ఎక్కించటం బాగుండదనే మాట వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు అతన్ని రాష్ట్ర కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడుగా నియమించినా, ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించి అతని వెంట వచ్చే పదిహేను నుండి ఇరవై మంది టి.డి.పి నాయకులకు టికెట్లు కేటాయించటం కూడా సమర్థనీయం కాదన్నది వారి వాదన. రేవంత్‌రెడ్డి మొన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులపై దుమ్మెత్తిపోశారు, అ లాంటి నాయకుడితో వారు ఎలా కలిసి పని చేస్తారన్నది ప్రశ్న.
రేవంత్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్‌ను పటి ష్టం చేసేందుకు రావటం లేదు, అతని ప్రధాన లక్ష్యం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి, దాని సాధన కోసం కాంగ్రెస్‌ను ఒక వేదికగా ఉపయోగించుకుంటాడని మరో సీనియర్ నాయకుడు చెప్పారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు సీనియర్ నాయకులు టి.ఆర్.ఎస్‌లో చేరిపోతారని వారు గంటాపథంగా చెబుతున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండాపోతోంది, అందుకే రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నారు తప్ప పార్టీపై ప్రేమతో కాదన్నది వారి వాదన. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో పార్టీ అధినాయకత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నది వారి అభిప్రాయం.